Browse audiobooks by Sripada Subhramanya Sastri, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
43 audiobooks in our catalogue, 40 with the narrator named.
[Telugu] - Janmanikalla Okate Muddu
"రామారావుకి ముగ్గురు అన్నలు. అన్నలందరూ సర్కారులో పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. తండ్రి జమీందారు దగ్గర ఆంతరంగిక మంత్రై ఉంటాడు. రామారావు తండ్రికి రాయవరం గ్రామంలో పదిపుట్ల భూమి ఉంటుంది. ఆ భూమిని దున్నడానికి నిర్ణయించున్న రామారావు తన అన్నలకి జాబు రాస్తాడు. అన్నయ్యలు వచ్చి ససేమిరా అన్న తర్వాత, ఆస్థి పంపకాలు జరుగుతాయి. రామారావుకి మిగిలిన రెండుపూటలా వాటా భూమిని సంతోషంగా దున్నుకుంటాడు. తర్వాత కథని మీరే వినండి."
Sripada Subhramanya Sastri (Author)
Audiobook · 27 mins
"పోస్టు జవాను మీరాసాహేబు... చలపతికి ఒక తంతి ఇస్తాడు. ఆ తంతిలో పొద్దున్న ఎనిమిది గంటలకి తనకి కూతురు పుట్టినట్లు రాసుంది. చలపతి మహానందభరితుడయ్యాడు. అందరికీ భోజనాలు సిద్ధం చేస్తాడు. పదకొండవ రోజున బిడ్డ బారసాలకోసం రాజమహేంద్రవరానికి వెళ్లి, కూతురుకి సుభద్రమ్మ అని నామకరణం చేస్తారు. సుభద్రమ్మ బాల్యము, విద్య ఎలా కొనసాగిందో మీరే వినండి."
Sripada Subhramanya Sastri (Author), Ramya Ponangi (Narrator)
Audiobook · 13 mins
[Telugu] - Juniouru kadu alludu
"చెంచురామయ్య చురుకైనవాడు. వయస్సు పాతికేండ్లకు మించలేదు. మంచి వేషగాడు. సైకిల్ లేనిదే ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు. తన తల్లి తప్ప వేరే దిక్కు లేదు. ఎప్పటికైనా ఐశ్వర్యవంతుడు అవ్వాలి లేదా ఐశ్వర్యవంతుడు కూతుర్నైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇంతకీ తన ఆశ నెరవేరుతుందా ? లేదా? మీరే వినండి."
Sripada Subhramanya Sastri (Author)
Audiobook · 28 mins
[Telugu] - Samudramunandali Manchukondalu
"మరిది, తోడికోడలు అసమర్ధతను గురించి భర్త సోమయాజులుతో నిష్టూరపోతూంటుంది చెల్లమ్మ. అన్నీ విని సోమయాజులు తల ఊపి ఊరుకుంటాడు. భర్త నిర్లక్ష్యాభావం చెల్లమ్మ హృదయాన్ని కలచి వేస్తుంది. మరిది మరియు తోడికోడలు వల్ల డబ్బులు వృధా అవుతున్నాయని, వాళ్ళకి బాధ్యత లేదని ... ఇకనుంచి వంటలు వేరు , ఖర్చులు వేరని కచ్చితంగా చెప్పేస్తుంది. తర్వాత ఏమి జరిగిందో విందాం."
Sripada Subhramanya Sastri (Author), K P kalidendi (Narrator)
Audiobook · 34 mins
[Telugu] - Badyatha medapadee dakane
"రాయజగపతి మహారాజుకి ఒక్కగానొక్క కొడుకు తిమ్మజగపతి. కొడుకుకి పట్టాభిషేకం చెయ్యాల్సిన రోజు సమీపిస్తోంది. కానీ తిమ్మజగపతి రాజైతే, మరి మంత్రి సంగతేంటని బెంగపెట్టుకుంటాడు. ప్రస్తుత మంత్రి రామాయామాత్యుడికి కూడా గోవిందయ్య ఒకడే కొడుకు. కానీ గోవిందయ్య అస్తమానూ వేశ్యావాటికలో ఉండడం చూస్తూ కూడా రామాయామాత్యుడేమీ కలగచేసుకోవడం లేదు. ఇది కూడా రాజుకి ఉక్కిరిబిక్కిరి కలిగిస్తోంది. కానీ బాధ్యత మీద పడితే మారుతాడని అందరూ అనుకుంటారు."
Sripada Subhramanya Sastri (Author), K P kalidendi (Narrator)
Audiobook · 20 mins
"పద్దెనిమిది యేండ్ల వయస్సులో రామయ్యకు సంసారాభారం మీదపడింది. ఇంట్లో ఒక వితంతు సోదరి, ఒక పెళ్లికాని చెల్లి మరియు అరవై యేండ్ల ముసలి తల్లి ఉన్నారు. తండ్రి మిగిల్చిపోయిన భూమి మీద కేవలం రెండు పుట్ల ధాన్యము మాత్రమే వస్తుంది. వేరే ఆదాయమేమి లేదు. పాండిత్యం లేని రామయ్య కుటుంబాన్ని పోషించడానికి ఏమి చేస్తాడు? ఎన్ని ఇబ్బందులు పడుతాడు?"
Sripada Subhramanya Sastri (Author), Padma Vangapalli (Narrator)
Audiobook · 25 mins
[Telugu] - Na Needa Chusukune Nenu Jankenu
"తను పుట్టిన మూడవరోజే వాల్ల అమ్మ చనిపోవడంతో వాల్ల సోమమ్మత్త చేతిలో పెరుగుతుంది. తల్లి చనిపోయిన సంవత్సరానికే వాల్ల నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో వాల్ల నాన్న బాగానే చూసుకునేవాడు. తర్వాత పట్టించుకోవటం మానేసాడు. సవతితల్లి సూటిపోటి మాటలు మాట్లాడేది. నాన్నకి చెప్పిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది. తన బాగోగులు ఎవరు చూస్తారు? తన పెళ్లి ఎవరితో జరుగుతుంది?"
Sripada Subhramanya Sastri (Author), Anuradha (Narrator)
Audiobook · 14 mins
"బంగారమ్మ పదకొండు సంవత్సరాల వయస్సు గల పిల్ల. పెండ్లిఈడే కానీ పెండ్లి చెయ్యడానికి పూనుకునేవారు లేరు. తన తండ్రి వేంకటశాస్త్రి ముప్పైఐదవ ఏట కాలగతి పొందాడు. తల్లి కాంతమ్మకు స్వయంగా వ్యవహారాల్ని నిర్వహించేంత సాహసం లేదు. వేంకటశాస్త్రి మేనల్లుడు పేరుభట్టుకి బంగారమ్మ అంటే చాలా ఇష్టం. బంగారమ్మకి పెళ్లి వయస్సు రాగానే, తాను పెళ్లి చేసుకుంటానని కాంతమ్మని అడుగుతాడు. కాంతమ్మ చాలా సంతోషిస్తుంది. తర్వాత ఏమి జరిగిందో మీరే వినండి."
Sripada Subhramanya Sastri (Author), Anuradha (Narrator)
Audiobook · 37 mins
[Telugu] - Thasildaru Gadu Varthakudu
"వేంకటసుబ్బయ్య బి.ఏ. పరీక్షకు చదువుతున్నప్పుడు సుందరమ్మ కాపురానికొస్తుంది. తహసీలుదారుగా ఉద్యాగానికి కాళీ లేకపోవడంతో కాలేజీలో ఉపాధ్యాయుడిగా ప్రవేశిస్తాడు. బోధనాశక్తి లేదనే కారణంతో ఆ ఉద్యోగం పోతుంది. తర్వాత కలెక్టరు కచేరీలో చేరుతాడు. ఆ ఉద్యోగం కూడా నిలుపుకోలేకపోతాడు. తర్వాత రెవిన్యూ ఇన్స్పెక్టర్ అవుతాడు. ఆ ఉద్యోగం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఎన్ని చేసినా ప్రయోజనం కలగలేదు. చివరికి బట్టల వర్తకం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు."
Sripada Subhramanya Sastri (Author), Yagnapal Raju (Narrator)
Audiobook · 18 mins
"లక్ష్మీనారాయణకు ఐదుగురు కూతుళ్ళ తర్వాత పుట్టిన కుమారుడికి తన తండ్రి పేరు పుల్లయ్య అని పెట్టాడు. కానీ ఆయన భార్యకి, కూతుళ్ళకి ఆ పేరు నచ్చక రాజగోపాలం అని పేరు పెడతారు. పుల్లయ్యకి చిన్నప్పటి నుంచే పోలీసు ఉద్యోగం చెయ్యాలని తల్లిదండ్రులు ప్రోత్సహించేవాళ్ళు. ఇంతకీ పుల్లయ్య పొలిసు అవుతాడా ? లేదా ? మీరే వినండి."
Sripada Subhramanya Sastri (Author), Srinivasarao Polidasu (Narrator)
Audiobook · 30 mins
[Telugu] - Velepedethe Alludainadu
"పద్మనాభశాస్త్రి అసూయవల్ల విశ్వనాధాన్ని వెలిపెడతాడు. కానీ అయన కుమార్తె నరసమ్మ , విశ్వనాధాన్ని గౌరవించి తనని పెళ్లాడుతుంది. అది తట్టుకోలేని పద్మనాభశాస్త్రి ఏమి చేస్తాడో ఈ కథలో వినండి."
Sripada Subhramanya Sastri (Author), Sri Lalitha (Narrator)
Audiobook · 25 mins
"వితంతువైన రామలక్ష్మి ,సూర్యారావుని ఇష్టపడుతుంది. తనని పెళ్లి చేసుకోవాలని ఒక చిట్టీలో రాసి పూలబంటిలో పెట్టి సూర్యారావుపైకి విసురుతుంది. కానీ ఆ బంతి సూర్యారావు స్నేహితుడు రంగారావు పైన పడుతుంది. రంగారావు కుట్ర వల్ల వాళ్లిద్దరూ విడిపోతారు. ఇంటి ఓనరు నగేంద్రనాథబెనర్జీ సహాయం వల్ల రామలక్ష్మి, సూర్యారావుని కలుస్తుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడంతో ఈ కథ ముగుస్తుంది."
Sripada Subhramanya Sastri (Author), Veturi Kanthi (Narrator)
Audiobook · 24 mins
[Telugu] - Cheera lekapothe Naku Pandaga Velladanukunnara Pullam Peta Jaree Cheera
"శ్రీపాదవారు తమ కధలను వారు చిన్న కధలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువు రీత్యా ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చరిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. 'శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మాటగట్టుకొని కధలలో కళ కట్టించును. అయన వాక్యంలో తెలుగు బాషా కొత్త సొగబులు అద్దుకుంది. ఆయన కథలు ఆనాటి సమాజంలో నెలకొన్న భావ సంఘర్షణకు అద్దం పట్టాయి. వ్యవహారిక భాషోద్యమానికి అండదండలందించాయి."
Sripada Subhramanya Sastri (Author), Swapnapriya (Narrator)
Audiobook · 8 mins
"ఎన్నో యేండ్లగా పర్సనల్ గుమస్తాగా పనిచేస్తున్న వేంకటప్పయ్యని ఆ ఉద్యోగం నుంచి తీసివేస్తారు రాయణింగారు. వేంకటప్పయ్య అంటే అక్కడి జనాలకు గడ గడ. తర్వాత చెంచు పున్నయ్యని దివాంజీ కుర్చీలో కూచోపెట్టారు రాయణింగారు. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), Santosh Raalapalli (Narrator)
Audiobook · 20 mins
"శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథ 'మాదిగపల్లె ' ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడు, మాదిగల మధ్య కాపురం చెయ్యడానికి వెళ్తాడు. వాళ్లతోనే వుండి వాళ్లని ఉద్ధరించడానికి, వాళ్లకు సరైన సలహాలు ఇవ్వడానికి నిశ్చయించుకుంటాడు. అక్కడి కులపెద్దలతో కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు."
Sripada Subhramanya Sastri (Author), Shrinivasrao Poludasu (Narrator)
Audiobook · 15 mins
"మహారాజశ్రీ పుల్లంరాజు చక్రవర్తిగారి పరిపాలన విశేషాల్ని ఈ కథలో వివరించారు. చక్రవర్తి ఒకసారి గుర్రపు పంద్యాలు చూడటానికి మరికొన్ని పనులు మీద బొంబాయి వెళ్లి పది రోజులున్నారు. అతను ఉన్న పది రోజులూ అక్కడ సభలు ఘనంగా జరిగాయి. అతనికి అన్నిటికంటే అస్పృశ్యతా నివారణ సభ చాలా బాగా నచ్చింది. అక్కడ గ్రహించిన విషయాలని తన అధికారంలో అమలుపరచాలని అనుకుంటారు. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), Shrinivasrao Poludasu (Narrator)
Audiobook · 21 mins
"కృష్ణయాజులకి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. కొడుకుల్లో చిన్నవాడు రామచంద్రం, కూతుళ్లలో పెద్దది చంద్రమ్మ. సంక్రాంతి పండుగ కోసం భర్త వెంకటరావుతో పుట్టింటికి వచ్చింది చంద్రమ్మ. పెద్దవాళ్లు పది రోజులు అక్కడే ఉండాలని కోరగా, వాళ్ల మాట కాదనలేక భార్యని పదిరోజుల కోసం అక్కడే వదిలి, వెంకటరావు తనొక్కడే వెళ్ళిపోయాడు. వీరేశలింగంపంతులు మీద ఉండే గురుభక్తి వల్ల, ఒక పునర్వివాహానికి హాజారవుతాడు. ఆ విషయం తెలిసిన కృష్ణయజులు అతన్ని దూషిస్తాడు. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), K P kalidendi (Narrator)
Audiobook · 50 mins
[Telugu] - Kanyasulkamu - Parasulkamu
"గున్నమ్మ చక్కని చుక్క. చామనచాయ అయినా సరే, శరీరం నిగనిగలాడుతుంటుంది. ఆమె తొలిసారి కాపురానికి వచ్చిన పది రోజులకే భర్త నిబంధనలు మొదలు పెట్టాడు. పుట్టింటి నుంచి తెచ్చిన సబ్బుబిళ్ళలు, సెంటుబుడ్లను చెరువులో పారేసాడు. ముందు ముందు తన కాపురం ఎలా సాగుతుందో తెలుసుకోండి."
Sripada Subhramanya Sastri (Author), Ramya Ponangi (Narrator)
Audiobook · 18 mins
[Telugu] - A- Kja -Daa langarandhaledu
"' కాంగ్రెస్సుకి నేను వస్తున్నాను. చామర్లకోటలో రేపు మెయిల్లో కలుసుకుంటాను' అని సుందరమ్మ రాసిన లేఖ రామచంద్రుడికి అందుతుంది. ఆ లేఖ చూసి రామచంద్రుడి కళ్లు జిగ జిగా మెరుస్తాయి. చామర్లకోట ప్లాటుఫారం దగ్గర సుందరమ్మని చూసి సంతోషిస్తాడు, కానీ ఆమె తండ్రిని చూసి కుంగిపోతాడు. రామచంద్రుడు సుందరమ్మని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వాళ్లిద్దరి మనోభావాలు కలుస్తాయా? వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా, లేదా? తెలుసుకోవడానికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), Yagnapal Raju (Narrator)
Audiobook · 45 mins
[Telugu] - Apidhalathi Vajrasya Hrudayam
"జానకమ్మ పెద్దకొడుకు భార్య సమర్తయిన తర్వాత పుట్టింట్లోనే వదిలేసి ఊరుకున్నారు. రెండో కొడుకు లక్షణంగా చేసుకుంటుండగా, పెద్ద కొడుకు అన్నీ వుండి బ్రహ్మచారిలా ఉన్నాడు. వియ్యంకులు వాళ్ల పెద్దకూతురికి ఒక ఎకరం, చిన్న కూతురికి ఒక ఎకరం పొలం ఇస్తామంటారు. కానీ అనుకోకుండా చిన్న కూతురుకి ఎకరంన్నర ఇవ్వాల్సివచ్చింది. దాంతో పేచీ వచ్చింది. ఇంతకీ జానకమ్మ పెద్దకొడుకు, కోడలు మళ్లీ ఒక్కటవుతారా? ఏమి జరుగుతుందో మీరే వినండి."
Sripada Subhramanya Sastri (Author), K P kalidendi (Narrator)
Audiobook · 23 mins
[Telugu] - Menarikamu Tappaledu
"ప్రకాశరాయడు కాకినాడలో పేరుపొందిన ప్లీడరు. మంచి సంపాదన. ఆయనకీ ఒక కొడుకు, ఒక కూతురు, రామారావు మరియు సుందరమ్మ. వేల కొద్దీ ఖర్చు పెట్టి కొడుకును బి.ఏ. చదివించాడు. కూతురు నాలుగవ తరగతి వరకు మాత్రమే చదివి స్కూలు మానేసింది. సుందరమ్మ పెళ్లీడుకి రాగానే తన మేనత్త , కొడుకుని తీసుకుని వచ్చి పిల్లని అడుగుతుంది. ప్రకాశరాయడు మేనరికానికి ససేమిరా అంటదు. తర్వాత ఏమి జరిగిందో ఈ కథలో వినండి."
Sripada Subhramanya Sastri (Author), Sri Lalitha (Narrator)
Audiobook · 23 mins
[Telugu] - Kachithamaina Javabhu
"సీతారామయ్య మరియు జానకిరామయ్య మేనత్త మేనమామ బిడ్డలు. ఒకరినొకరు బావా బావా అని పిలుచుకుంటారు. ఒక రోజు అనుకోకుండా ఇద్దరూ చామర్లకోట ప్లాటుఫారం మీద కలుస్తారు. సీతారామయ్య ఒక వితంతువుని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ,అలా చెయ్యొద్దని సలహా ఇస్తాడు జానకిరామయ్య. తర్వాత ఏమి జరుగుతుందో మీరే వినండి."
Sripada Subhramanya Sastri (Author), Anuradha (Narrator)
Audiobook · 1 hr 30 mins
"నీలాద్రి రాజు తన డెబ్బయ్యో ఏటా కొడుకు పుల్లంరాజుకి పట్టం కట్టాడు. పుల్లంరాజుకి పట్టాభిషేకం జరిగింది. రామచంద్రయ్యకు ఆ కుటుంబం గుట్టంతా తెలుసు. పుల్లంరాజు తండ్రి నీలాద్రిరాజు... రామచంద్రయ్య సలహాని దాటొద్దని చెప్పి వెళ్తాడు. కానీ పుల్లం రాజు తీసుకున్న కొన్ని స్వంత నిర్ణయాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోవడానికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), Shrinivasrao Poludasu (Narrator)
Audiobook · 27 mins
"తీర్థయాత్రకి వెళ్లాలననుకున్న సబ్ ఇన్స్పెక్టర్ హత్యా విచారణ వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. డెబ్భై యేండ్ల ముసలాడు వచ్చి కాళ్ల మీద పడి తన కొడుకుని ఎవరో చంపేశారని , మీరే దర్యాప్తు చెయ్యాలని వేడుకుంటాడు. క్షణంలో ప్రయాణం గురించి మర్చిపోయి ముసలాయనకు సహాయం చెయ్యడానికి వెళ్తాడు. ఆ కేసుని ఎలా దర్యాప్తు చేసారో ఈ కథలో విందాం."
Sripada Subhramanya Sastri (Author), Swarnalatha (Narrator)
Audiobook · 20 mins
[Telugu] - Malli Idhu Kottedaka
"భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణే ఈ కథ. రాత్రిళ్లు కష్టపడి నాటకాలు రాసి , నిద్రలేక తెల్లవారుజామున నిద్రపోతుంటాడు భర్త. అతని తెల్లవారుజాము నిద్రకి భంగం కాకుండా నడుచుకునే భార్య . వారిద్దరి మధ్య జరిగే సంభాషణలు వినండి."
Sripada Subhramanya Sastri (Author), Swarnapriya (Narrator)
Audiobook · 28 mins
[Telugu] - Pelladatagga Mogadedi
"జాతికి అనుగుణమైన విద్య నేర్చిన బాలిక నిజంగా స్త్రీ... రత్నం అవుతుంది. మన పూర్వులు స్త్రీని పశువుగా తయారుచేసే సన్నివేశాలు కల్పించారు. అయితే వారు... స్త్రీ పశువైపోతే, ఆ స్త్రీల చేతుల్లో పెరిగే మొగపిల్లలు కూడా పశువులయిపోతారని గ్రహించలేకపోయారు."
Sripada Subhramanya Sastri (Author), Anuradha (Narrator)
Audiobook · 46 mins
"జానకమ్మ చాలా గంభీరురాలు . ఇప్పుడు రాజకీయాలలో పని చేసే వారికి గల పలుకుబడి ఆమెకి తెలుసు. తన పినతండ్రి కూతురైన సుభద్ర మూడు మాసాల పాటు శిక్ష కూడా అనుభవించి రావడం వల్ల, ఎక్కడికి వెళ్లినా చాలా గౌరవం పొందుతోంది. జానకమ్మ రాజకీయంలోకి దిగితే తనకి కూడా అసాధారమైన ఆధరగౌరవాలు లభిస్తాయి అనేది తన అభిప్రాయం."
Sripada Subhramanya Sastri (Author), K P kalidendi (Narrator)
Audiobook · 24 mins
"బలవంతుడైన వ్యక్తి తాను బలవంతుడినని అహంకారపడితే... పాము ఎంత బలం కలిగి ఉన్నప్పటికీ, చలిచీమలచేత పట్టుబడి చచ్చినట్లే... వాడి పరిస్థితి కూడా అవుతుంది. కాబట్టి బలంతో అందరితో వైరము పెట్టొకోవడం బుద్ధితక్కువ అని ఈ కథ తెలియజేస్తుంది."
Sripada Subhramanya Sastri (Author), Sri Lalitha (Narrator)
Audiobook · 41 mins
"కాటన్న, సోమాలూ... పేర్రెడ్డి దగ్గర పనిచేస్తుంటారు . వేరు వేరు కులాలైన వారిద్దరూ ప్రేమలో ఉంటారు. పేర్రెడ్డి భార్య రంగమ్మ, వాళ్లకి పెళ్లి చెయ్యడానికి ఎలా సహాయం చేసిందో ఈ కథలో తెలుసుకోవచ్చు."
Sripada Subhramanya Sastri (Author), K P kalidendi (Narrator)
Audiobook · 35 mins
[Telugu] - Adallani Pinchakudadhu
"నీలమ్మ తన ఇంటికీ వచ్చిన ప్రేమికుడిని రహస్యంగా దొడ్డిదారిలో బయటకి పంపిస్తుంది. అది చూసిన భూలోకమ్మ , నీలమ్మని అనరాని మాటలంటుంది. ఒకరోజు నీలమ్మ ఇంట్లో కనిపించకపోవడంతో , అందరూ తన ప్రియుడితో లేచిపోయిందనుకుంటారు. నీలమ్మ తండ్రి వీరయ్య తన కూతురిని లేవదీసుకుపోయాడని సుబ్బారావు మీద కేసు పెడతాడు. తర్వాత ఏమి జరిగిందో మీరే వినండి."
Sripada Subhramanya Sastri (Author), Anuradha (Narrator)
Audiobook · 21 mins
"రావులయ్య చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. రావులయ్యకి భూతృష్ణ ఎక్కువైంది . రాయవరమున షరతాఖరైన భూములన్నీ అతడే పుచ్చుకున్నాడు. పది సంవత్సరాలు గడిచాక, రావులయ్యకు వయస్సు పెరిగింది, సంపత్తు పెరిగింది, యశస్సు పెరిగింది. సర్కారు రాకపోకలు కూడా పెరిగాయి."
Sripada Subhramanya Sastri (Author), Bhogendranath Parupalli (Narrator)
Audiobook · 15 mins
[Telugu] - Iruvuramokka chotake Podamu
"జగ్గారెడ్డి మరియు వెంకమ్మకు చిన్నప్పటి నుండే స్నేహం మొదలయ్యింది. ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఆటలాడుకునేవాళ్లు. వాళ్లిదరు యవ్వనంలోకి వచ్చాక వెంకమ్మ తల్లి మునుపటివలె చనువుగా ప్రవర్తించకూడదని ఆంక్షలు పెడుతుంది. వారికి ఒకరిపై ఒకరికి మొహం ఏర్పడింది. ఎన్ని నిబంధనలు పెట్టినా , వాళ్ళిద్దరూ రహస్యంగా కలిసేవారు. వెంకమ్మకి తన తల్లిదండ్రులు వేరే సంభందం కాయం చెయ్యడంతో జగ్గారెడ్డి ఏమి చేస్తాడు? వాళ్లిద్దరూ ఒక్కటవుతారా? ఏం జరుగుతుందో ఈ కథలో వినండి."
Sripada Subhramanya Sastri (Author), Anuradha (Narrator)
Audiobook · 19 mins
[Telugu] - Thenugu Raktham Chappabadi Pothu Undi
"'బతుకుతెరువు కోసం , నిజాయితీగా చేసే ఎలాంటి వృత్తిని ఎంచుకున్నా తప్పేమి లేదు అనే అంశం మీద ఈ కథ జరుగుతుంది. ''అయినవాళ్లు , కానివాళ్లు కూడా ఉద్యోగాలు చేసి విరగబడి పోతూఉంటే తన కొడుకు కూడా అలా ఉండాలని గంపెడాశ పెట్టుకుని ఇంగ్లీషు చదువులు చదివించాను , కానీ దైవానుగ్రహం లేదని బాధ పడుతుంది తల్లి''. '' నీ శక్తి కొద్దీ నన్ను చదివించావు, అది నా శుభం కోరే, సందేహం లేదు. కానీ ఉద్యోగం నా తత్వానికి సరిపడదంటే వినరు కదా అంటదు కొడుకు.'' ఇంతకీ ఏమి జరిగింది, తాను బతుకుతెరువు కోసం ఏ వృత్తిని ఎంచుకుంటాడో ఈ కథలో తెలుసుకోండి.'"
Sripada Subhramanya Sastri (Author), Swarnapriya (Narrator)
Audiobook · 26 mins
"కొచ్చెర్ల వెంకటరాయణిగారికి బంధుప్రీతి చాలా ఎక్కువ. ఆయనకి అన్నీ క్షుణ్ణంగా తెలుసు. అన్నీ తనే స్వయంగా తనిఖీ చేస్తారు. ఆయనకి హాస్యరసం చాలా ఇష్టం. ఆయన ధోరణి , కలుపుగోలుతనం మరియు స్వరూపస్వభావాలు తెలుసోవడానికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), Swarnapriya (Narrator)
Audiobook · 24 mins
"ఇది శ్రీ శ్రీ శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు పెద్దాపురం రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో నిజంగా జరిగిన కథ. రాజ్యం అంత సర్వ విధాలూ సుభిక్షంగా ఉంది. కాలకుశలు అందరూ రాజపూజ్యత అనుభవిస్తున్నారు. కానీ వారంటే దివాన్జీకి వల్లమాలిన కోపం. ఏవో నాలుగు కబుర్లు చెప్పి, ఇంద్రుడవనీ, చంద్రుడవనీ, పొగిడి వేలకొద్దీ డబ్బు కాజేస్తారని, అగ్రహారాలు కూడా కొట్టేస్తారనీ ఆ కోపం."
Sripada Subhramanya Sastri (Author), K P kalidendi (Narrator)
Audiobook · 22 mins
[Telugu] - Tahathu Malina Parugu
"వెంకీ సోదెమ్మ మరియు గోపాలయ్య దంపతులకు నరసమ్మ ఒక్కటే కూతురు. బడిలో నాలుగవ తరగతి చదివింది. చమనఛాయే అయినా కూడా రూపవతి. వాళ్ళు కూతురికి ఎలాంటి లోపమూ చెయ్యలేదు. వాళ్ల ప్రయత్నానికి తగినట్లే బుద్ధిమంతురాలు అయ్యింది. నరసమ్మకు పెళ్లీడుకు వచ్చాక తనకి పెళ్లి చేయడానికి తల్లితండ్రులు పడ్డ తిప్పలేమిటో ఈ కథలో తెలుస్తుంది."
Sripada Subhramanya Sastri (Author), Swapnapriya (Narrator)
Audiobook · 15 mins
[Telugu] - Kshirasagara Madhanam
"1934 సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవైరెండో తేదీన ఆంధ్రపత్రికలో వరుడు కావేలెను కావలెను అనే ప్రకటన ఉంది. ప్రకటనలో కొల్లాయపేట జమీందారు ఎం. ఎల్ .సి. గారి ఏకైక పుత్రిక శ్రీమతి నాగరత్నమ్మగారు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించున్నారని తెలిపారు. శ్రీమతి నాగరత్నమ్మ గారి వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు. వరుడు ఏ శాఖవాడైనా పర్లేదు కానీ బ్రాహ్మణుడై ఉండాని తెలిపారు. వరుడు రెండో పెళ్లివాడైనా కూడా ఇబ్బంది లేదు. కొల్లాయపేట రాజపుత్రి వివాహం ఎవరితో, ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), Swarnapriya (Narrator)
Audiobook · 36 mins
"ప్రకాశం అనే వ్యక్తి, ఒక పతితసంఘంలోని పిల్లని పెళ్లాడటమే ఈ కథ. ఆ పిల్లని పెళ్లాడటంలో తన విద్యాధికతకు తగిన ఔన్నత్యాన్ని, జ్ఞానానికి తగిన విచక్షణతని, తన అభిజాత్యానికి తగిన ఔదర్యాన్నీ వెల్లడించి స్తుతిపాత్రుడవుతాడు. ఈ సంఘటన అనేకులకు ఆదర్శం అవుతుంది."
Sripada Subhramanya Sastri (Author), Padma Vangapalli (Narrator)
Audiobook · 42 mins
"పదకొండేళ్లకే బాలవితంతువు అయిన ఒక రెడ్డి యువతి మరల పెళ్లి చేసుకున్నట్లు కల్పించిన కథ ఇది. అప్పటికి ఆమె రజస్వల కూడా కాలేదు. ముక్కుపచ్చలారని ఆ వితంతువుని చూసి అందరూ బాధపడ్డారు. ఇక ఆమె తల్లిదండ్రులు సంగతి వర్ణనాతీతం. ఆమె తల్లి చాలాకాలం నిద్రాహారాలు మానేసింది. తండ్రి అనేక వ్యవహారాలు మరచిపోయాడు. కులంలో చలనం పుట్టింస్తుందనే ఆశతో సుబ్రమణ్య శాస్త్రి గారు ఈ కథ రాసారు."
Sripada Subhramanya Sastri (Author), laxmiprasanna (Narrator)
Audiobook · 29 mins
[Telugu] - Nalugurni Poshisthunnanippudu
"అమలాపురం హైస్కూలులో చదివి పాస్సయ్యి , స్వగ్రామంలో నౌకరీ దొరుకుందేమో అని ప్రయత్నం చేసి ... కుదరకపోవడంతో నగరానికి వెళ్తాడు ఒక బ్రాహ్మణుడు. అక్కడ ఉద్యోగం దొరుకుతుంది. నెలకి ఇరవై ఐదు రూపాయలతో మొదలైన తన ఉద్యోగం సంవత్సరం తర్వాత ముప్పై ఐదు రూపాయలకు చేరింది. తర్వాత సూరిరావు మరియు సుబ్బారావుగారు బట్టల వర్తకంలో మిషను పని చూసుకునేవాడు. అన్నీ ఖర్చులు పోనూ నెలకి వంద రూపాయలు మిగులుతాయి. మొదట ఒకరి చేతికింద పని చేసినా , ఇప్పుడు నలుగుర్ని పోషించే స్థాయికి ఎదుగుతాడు."
Sripada Subhramanya Sastri (Author), Anuradha (Narrator)
Audiobook · 18 mins
"అశ్వహృదయం అంటే గుర్రాలను నియత్రించే మంత్రం. శ్రీ శ్రీ శ్రీ వత్ససాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజుకి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఆయన గుర్రం పేరు పంచ కళ్యాణి. ఆ గుర్రం బాగోగులు చూసే లచ్చిగాడు కొద్దోగొప్పో అశ్వలక్షణాలు తెలిసినవాడు. మహారాజు ఒక్కరోజు స్వారీ చెయ్యకపోయినా గుర్రం హంగామా చేసేస్తుబ్ధి. ఒక రోజు మహారాజు చదరంగం ఆడుతుండగా , పంచ కళ్యాణి కట్టుతాళ్లు తెంచుకుని పరవళ్లు తొక్కేస్తుంది. లచ్చిగాడు కూడా హైరానయిపోతాడు. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), భోగీంద్రనాథ్ పారుపల్లి (Narrator)
Audiobook · 20 mins
"గ్రామస్థులు అడిగిన పది రూపాయల వరపక్షం ఇవ్వనందున వెంకట దీక్షితులు గారి రెండవ కుమార్తె సుభద్ర పెళ్లి , పీటలమీద ఆగిపోతుంది. మొదటి భార్య పోయినప్పటి నుంచి సుభద్ర మీదే మనసు పెట్టుకున్న కిరీటి రావు కూడా ఆ పెళ్ళికి హాజరవుతాడు. అలాంటి సమయంలో , వెంకట దీక్షితులు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలుసుకోవాడికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), Bhogendranath Parupalli (Narrator)
Audiobook · 34 mins
[Telugu] - Vatti Pattudala tappa emiledu
"రామశాస్త్రి గారు ఒక సభా చర్చలో సత్యవతితో ఆమె రచనల గురించి వాదానికి వెళ్తారు. ఆమె ఎవరో ఆయనకి తెలియదు . శాస్త్రి తన ఉపన్యాసాన్ని చదివాడు తర్వాత సత్యవతి ఉపన్యాసాన్ని సెక్రటరీ చదివాడు. అది విన్న శాస్త్రికి ముఖాముఖి వాదించడానికి ముచ్చెమటలు పోశాయి. మాటలలో ఉండే గంభీర్యం తగ్గిపోయింది . సత్యవతి గారి కోసం జనం కేకలు పెట్టడంతో ఆమె తెరచాటు నుంచి వచ్చి శిరము వంచుకుని శాస్త్రి ఎదుట నుంచుంది. శాస్త్రికి ఆమెను చూసి చైతన్యం లోపించిపోయింది. నోట మాట రాలేదు. అసలేమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి."
Sripada Subhramanya Sastri (Author), Yagnapal Raju (Narrator)
Audiobook · 31 mins
©PTC International Ltd T/A LoveReading is registered in England. Company number: 10193437. VAT number: 270 4538 09. Registered address: 157 Shooters Hill, London, SE18 3HP.
Terms & Conditions | Privacy Policy | Disclaimer