Save on books. Give 25% back to schools. *15% of eBooks.
Audiobooks Narrated by Yagnapal Raju
Browse audiobooks narrated by Yagnapal Raju, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
3 audiobooks in our catalogue, every one with its narrator named.
"వేంకటసుబ్బయ్య బి.ఏ. పరీక్షకు చదువుతున్నప్పుడు సుందరమ్మ కాపురానికొస్తుంది. తహసీలుదారుగా ఉద్యాగానికి కాళీ లేకపోవడంతో కాలేజీలో ఉపాధ్యాయుడిగా ప్రవేశిస్తాడు. బోధనాశక్తి లేదనే కారణంతో ఆ ఉద్యోగం పోతుంది. తర్వాత కలెక్టరు కచేరీలో చేరుతాడు. ఆ ఉద్యోగం కూడా నిలుపుకోలేకపోతాడు. తర్వాత రెవిన్యూ ఇన్స్పెక్టర్ అవుతాడు. ఆ ఉద్యోగం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఎన్ని చేసినా ప్రయోజనం కలగలేదు. చివరికి బట్టల వర్తకం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు."
"' కాంగ్రెస్సుకి నేను వస్తున్నాను. చామర్లకోటలో రేపు మెయిల్లో కలుసుకుంటాను' అని సుందరమ్మ రాసిన లేఖ రామచంద్రుడికి అందుతుంది. ఆ లేఖ చూసి రామచంద్రుడి కళ్లు జిగ జిగా మెరుస్తాయి. చామర్లకోట ప్లాటుఫారం దగ్గర సుందరమ్మని చూసి సంతోషిస్తాడు, కానీ ఆమె తండ్రిని చూసి కుంగిపోతాడు. రామచంద్రుడు సుందరమ్మని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వాళ్లిద్దరి మనోభావాలు కలుస్తాయా? వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా, లేదా? తెలుసుకోవడానికి ఈ కథని వినండి."
"రామశాస్త్రి గారు ఒక సభా చర్చలో సత్యవతితో ఆమె రచనల గురించి వాదానికి వెళ్తారు. ఆమె ఎవరో ఆయనకి తెలియదు . శాస్త్రి తన ఉపన్యాసాన్ని చదివాడు తర్వాత సత్యవతి ఉపన్యాసాన్ని సెక్రటరీ చదివాడు. అది విన్న శాస్త్రికి ముఖాముఖి వాదించడానికి ముచ్చెమటలు పోశాయి. మాటలలో ఉండే గంభీర్యం తగ్గిపోయింది . సత్యవతి గారి కోసం జనం కేకలు పెట్టడంతో ఆమె తెరచాటు నుంచి వచ్చి శిరము వంచుకుని శాస్త్రి ఎదుట నుంచుంది. శాస్త్రికి ఆమెను చూసి చైతన్యం లోపించిపోయింది. నోట మాట రాలేదు. అసలేమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి."