Save on books. Give 25% back to schools. *15% of eBooks.
Audiobooks Narrated by Bhogindranath
Browse audiobooks narrated by Bhogindranath, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
2 audiobooks in our catalogue, every one with its narrator named.
"గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మనం ఎవరమో , ఎప్పుడు ఎక్కడ బయలుదేరామో..బతుకుదారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో.. ఏ గొప్పలు చూశామో, ఏ తప్పులు చేశామో తెలిస్తే తప్ప గత కాలం గురించి సరైన అవగాహన కలగదు. గతం తెలియనిదే వర్తమానం అర్దం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. దారిదీపం కావలసిన భారత చరిత్ర విదేశీయుల చేతుల్లో అష్తావక్రంగా ఎలా తయారైందో..మహాక్రూరులను మహాపురుషులుగా, జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ, విధ్వంసకులను నిర్మాతలుగా కీర్తిస్తూ కుహనా చరిత్రకారులు ఇన్నాళ్ళూ మనల్ని ఎలా మొసగించారో రుజువుచేసే శాస్త్రీయ విశ్లేషణ.అక్బర్ ,షాజహన్ లాంటి దుర్మార్గులను మహాపురుషులుగానూ,అసలైన భారతీయ మహాపురుషులనేమో దుష్టులుగానూ చిత్రించిన కుహనా చరిత్రకారుల బండారాన్ని బయటపెట్టే అపూర్వ సంచలనాత్మక గ్రంథం .దీన్ని చదవటం జీవితంలొ మరచిపోలేని గొప్ప అనుభవం."
"ఎవరైనా ఎందుకు ప్రాణాలకు హామీ లేని ఉద్యమాల్ని కావాలని కావిలించుకుంటారు? ఎందుకని తమ పరిసరాల మీద తెగించి తిరుగబడతారు? చివరికి, ఎందుకని తిరుగుబాట్ల మీద కూడా తిరుగబడతారు? అలాంటి మనుషులు ఎలా 'తయారవుతా'రు? వాళ్లు అలా అవడానికి, పార్టీల్లోనయినా బయటయినా 'రెబెల్స్' గా ఉంటానికి భౌతిక, మానసిక కారణాల అన్వేషణ ఈ నవల. పవన్ కుమార్ అనే ఒక సామాన్యుని కథ ఇది. బతుకు పయనంలో భాగంగా, ఉద్యమంలోనికి బయటికి అతడి 'ట్రావెలోగ్' ఈ నవల. నవల చదువుతున్నప్పుడు నావలికునితో మీరు అంగీకరిస్తారు, పేచీ పడతారు. అంగీకారం, పేచీలను ఆనందిస్తారు. ఇది కవి, కథకుడు హెచ్చార్కె తొలి నవల. ఒకరకంగా, నవలా రచనలో కొత్త పద్ధతి. 'ఫ్యాక్ట్ ఈజ్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ' అనే పాత్రికేయ పలుకుబడి ఈ నవలను నడిపించిన స్పిరిట్."